Malavika Mohanan on South Industry: ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాలో చేస్తున్న మాళవిక మోహనన్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికంటే ముందు ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ – హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరని అన్నారు. ఓ సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంటే హీరోలకు భారీ కానుకలు అందిస్తారని, కానీ హీరోయిన్స్‌కు మాత్రం అలాంటిది ఏమీ ఉండవని అన్నారు. హీరోయిన్లను పెద్దగా గుర్తించరని పేర్కొన్నారు. పైగా ఏదైనా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే హీరోయిన్ అన్‌లక్కీ అనే కామెంట్స్ చేస్తారని, ఆమె వల్లనే సినిమా ఫ్లాప్ అయినట్లు చూస్తారని చెప్పుకొచ్చింది.
Malavika Mohanan about Prabhas (Raja saab) : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాళవిక మోహనన్ మాట్లాడుతూ… రాజాసాబ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమాలో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భాగం అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. “ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఇంటి భోజనం ఎంతో రుచికరంగా ఉంటుంది” అని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.