Jr NTR: హరికృష్ణ మనవడు.. మరో నందమూరి తారక రామారావు తెరపైకి..

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నంద‌మూరి తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ను వైవీఎస్ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. ఈ సంద‌ర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

“రామ్ సినీ ప్ర‌పంచంలోకి నీ మొదటి దశకు ఆల్ ది బెస్ట్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీవు చేసే ప్ర‌తి ప్రాజెక్టు విజ‌యం సాధించాలి. నీకు అన్నింటా విజయమే ద‌క్కాల‌ని కోరుకుంటున్నా. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల‌ ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు క‌చ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటావ‌న్న నమ్మకం నాకుంది. నీ భ‌విష్య‌త్తు దెదీప్య‌మానంగా వెగిలిపోవాలి మై బాయ్” అని తార‌క్ ట్వీట్ చేశారు.