”పరిశోధనల కోసం వెళ్లి . . అంతరిక్షంలో చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యంగా ఉన్నారు భారత్ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ . .” బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్, బుచ్ విల్మోర్ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. ఓటు మా బాధ్యత!
“బ్యాలెట్ కోసం మా అభ్యర్థనను కిందకు పంపించాం. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం మా కీలక కర్తవ్యం. మా విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుంది” అని విల్మోర్ వెల్లడించారు. అనంతరం సునీత మాట్లాడారు. “ఓటు మా బాధ్యత. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నా” అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు .