Leaves: మనసు బాలేదా? అయితే సెలవు తీసుకోండి.!ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌..

చైనా: ఉద్యోగులు తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాలేనప్పుడు ఆఫీసుకు రావద్దంటోంది ఓ కంపెనీ. ఆరోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్‌ కదా… అర్జంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా.. ఆగండాగండి.. ఇది ఇండియాలో కాదు.. చైనాలో. చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ … Read more

Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..  

ఎయిర్ ఇండియా  సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే..  ఇప్పుడు మరో బెదిరింపుతో ఆ సంస్థ ఆందోళనలో పడింది. మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా  ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కు ఈ బాంబు బెదిరింపు వచ్చింది.  సమాచారం తెలిసి సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్‌ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్‌లు రంగంలోకి … Read more

Jupiter: జుపిటర్ మీదా బతికొచ్చా?  నాసా భారీ రాకెట్ ప్రయోగం

ఇతర గ్రహాలపై జీవించేందుకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి.  అందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా అనేక ప్రయోగాలు చేస్తోంది.  ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు జరుగుతుండగా ఇప్పుడు జుపిటర్ (గురుగ్రహం) చల్లని చంద్రుడు యూరోపా మానవ నివాస యోగ్యమేనా అనే విషయం తెలుసుకునేందుకు సోమవారం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్‌ను ప్రయోగించింది. యూరోపాపై అపారమైన భూగర్భ సముద్రం ఉందని శాస్త్రవేత్తలు … Read more

ISRO Shakthi SAT: హైస్కూల్ విద్యార్థినులకు చంద్రయాన్‌-4 ఉపగ్రహం తయారీలో శిక్షణ

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇశ్రో.. చంద్రయాన్-4 మిషన్‌ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.  అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్‌ స్టార్టప్‌ సంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’.. సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు శక్తిశాట్‌ అనే మిషన్‌ను ప్రారంభించింది.  అందులో భాగంగా 108 దేశాలకు చెందిన 12వేల మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై … Read more

SpaceX: చరిత్ర సృష్టించిన ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌

ఎలన్‌ మస్క్‌ మరో అరుదైన రికార్డును నమోదు చేసుకున్నారు. అతడి కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానంలో అద్బుత విజయాలు సాధించింది. ఇప్పుడు మరో ఘనవిజయం సాధించింది. దీంతో ఎలన్ మస్క్ మరో సారి ప్రపంచం తనవైపు చూసేలా చేరనే చెప్పాలి. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే చేర్చి ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. దీంతో రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో గణనీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ … Read more

Gaza: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 19 మంది మృతి

ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. దాడులు ప్రతిదాడులతో తెగబడుతున్నాయి. వేల కొలది చిన్నారులు, పెద్దలు చనిపోతున్నారు. ఈ క్రమంలో  సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుసిరత్‌లో ఓ పాఠశాలపై ఆదివారం ఇజ్రాయెల్ మరో   వైమానిక దాడికి తెగబడింది. దాడిలో 19 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ … Read more

Uppal Stadium: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం.. వీహెచ్‌పీ హెచ్చరిక

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  భారత్-బంగ్లాదేశ్ ట్వంటీ 20 మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఇంటర్ నేషనల్ మ్యాచ్ ను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను జరగనివ్వం అంటే విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడి నేపథ్యంలో వీహెచ్‌పీ ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత్-బంగ్లా మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించింది. … Read more

లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 18 మంది మృతి

లెబనాన్‌లోని సెంట్రల్ బీరూట్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.  18 మంది మరణించారు. 92 మంది గాయపడ్డారు. ఈ దాడులతో ఒక నివాస భవనం తీవ్రంగా దెబ్బతిన్నదని, మరో భవనం కుప్పకూలిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రస్ అల్-నాబా ప్రాంతంలో మొదటి దాడి జరిగింది. ఎనిమిది అంతస్తుల భవనం కింది భాగంలో పేలుడు సంభవించింది. అదే సమయంలో బుర్జ్ అబీ హైదర్ ప్రాంతంలో రెండో దాడి జరిగింది. అక్కడ భవనం … Read more

Trump on Modi:  అత్యుత్తమ నాయకుడు మోదీ అంటూ ట్రంప్ పొగడ్తలు

అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలో ట్రంప్ అందరినీ కలుపుపోతున్నాను అనేలా వ్యవహరిస్తున్నారు. మొన్న ఎలన్ మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రశంసించారు. మోదీ తన స్నేహితుడని, ఉత్తమ వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.  ఫ్లాగ్రాంట్ పోడ్‌కాస్ట్‌లో ప్రపంచ నాయకులపై తన … Read more

Nobel Prize in Chemistry 2024: రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ బహుమతి

రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతి వరించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకుగానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్‌ హసబిస్‌, జాన్‌ ఎం.జంపర్‌ను ప్రతిష్టత్మక నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరక రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. కంప్యుటేషనల్ ప్రొటీన్‌ డిజైన్‌కుగానూ బెకర్‌, ప్రొటీన్‌ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కు గానూ డెమిస్‌, జంపర్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.