Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part- 4

(రచయిత- పొట్లూరి పార్థసారధి):   భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లని విడగొట్టి ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఈస్ట్ తైమూర్ దేశం లాగా!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలని తెలుసుకుంటే మొత్తం కుట్ర కోణం బయటపడుతుంది!

అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది!
ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్న తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. ఆలోచన మాత్రం ఒక దశాబ్ద కాలం నాటిది.
ఆలోచన నిర్ణయరూపం తీసుకుంది మాత్రం మూడేళ్ళ క్రితమే!
*******
బంగ్లాదేశ్ లో మిలటరీ బేస్ తో పాటు ఒక నావీ బేస్ ను కూడా ఏర్పాటు చేయాలని తరువాత నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు అని వాళ్ళకి తెలుసు.
మరి అమెరికా తన ప్లాన్ ను ఎలా అమలు చేయగలదు?
*********
అమెరికా తన ప్లాన్ ను అమలు చేయాలంటే ఒక్కటే మార్గం!
అది భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లలో ఒక్కో భాగం విడగొట్టి కొత్త పేరుతో ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి!
ఇది ఎలా సాధ్యం అవుతుంది?
ఒక్కో అడ్డంకిని నరుక్కుంటూ రావాలి!

1.మూడేళ్ల క్రితమే మణిపూర్ లో చిచ్చు పెట్టింది అమెరికా. మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది!

2. మణిపూర్ లో హింసకి పాల్పడుతున్నది క్రిస్టియన్ కుకీలు. గిరిజనులు అని ST కోటా కింద ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు కానీ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు.

3. మణిపూర్ లో హింస చెలరేగడానికి హై కోర్టు తీర్పు కారణం. బంగ్లాదేశ్ లో హై కోర్టు తీర్పు వల్ల హింస ప్రజ్వరిల్లింది. చివరికి సుప్రీం కోర్టు కోటా 30 శాతం నుండి 5 శాతం కి తగ్గించినా సరే!
పై రెండింటిలో సారూప్యత ఉంది కదా?

4. జూన్ నెల మొదటి వారంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా మూడో దేశం తమ దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది అంటూ అంతర్గత భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ కి చెందిన స్క్వాడ్రన్ లీడర్ (Retd.) సద్రుల్ అహ్మద్ ఖాన్ (Sadrul Ahmed Khan) తో చెప్పినట్లు తెలుస్తోంది.

5. సద్రుల్ అహ్మద్ ఖాన్ బంగ్లాదేశ్ ఫైనాన్స్ మరియు ప్రణాళిక సంఘం సభ్యుడు, అవామీ లీగ్ పార్టీ సభ్యుడు.

6. జూన్ నెల మొదటివారంలో The Sunday Guardian పత్రికా విలేఖరి సర్దుల్ అహ్మద్ ఖాన్ తో ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంలో సాద్రుల్ అహ్మద్ ఖాన్ షేక్ హసీనా తనతో ఏమి చెప్పారో వెల్లడించాడు.

7. సద్రుల్ అహ్మద్ ఖాన్: మియన్మార్ (బర్మా) లోని కుకీ చిన్ ప్రావిన్స్ ( Kuki Chin Province) , బంగ్లాదేశ్ లోని చత్తోగ్రామ్ పర్వత ప్రాంతాలు, భారత్ లోని మిజోరం లతో కలిపి ఒక చిన్న దేశం ఏర్పాటు చేయాలి అని కుట్ర జరుగుతున్నది.

8. ఈ మూడు ప్రాంతాలలో క్రిస్టియన్ జనాభా మెజారిటీ లో ఉంది.

9. బర్మాలో సైనిక నియంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుకీ చిన్ రెబెల్ గ్రూపు ఆయుధాలతో ఎదురు దాడులు చేస్తున్నారు. ఈ రెబెల్ గ్రూపు ఇతర నాన్ కుకీ చిన్ గ్రూపులతో కలిసి పోరాటం చేయదు. బర్మా లో చాలా రెబెల్ గ్రూపులు అక్కడి సైన్యంతో పోరాడుతున్నాయి కానీ కుకీ చిన్ రెబెల్ గ్రూపు అదీ క్రిస్టియన్ లు మాత్రమే పోరాడుతున్నారు. ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే నాన్ కుకీ చిన్ గ్రూపులలో క్రిస్టియన్లు ఉన్నా వాళ్ళని కుకీ చిన్ రెబెల్ గ్రూపు దగ్గరికి రానివ్వదు.
ఎందుకంటే కుకీ చిన్ రెబెల్ గ్రూపుకు గట్టి సూచనలు ఉన్నాయి ఇతర గ్రూపుల్లో క్రిస్టియన్లు ఉన్నా వాళ్ళని కలుపుకొని పోరాటం చేయవద్దు అని. అలా చేస్తే కుకీ చిన్ లకి ప్రత్యేక క్రిస్టియన్ దేశం ఏర్పడడానికి అడ్డుపడుతారు అని.

10. కుకీ చిన్ గిరిజన క్రైస్తవ రెబెల్ గ్రూపు పూర్తిగా చర్చి ఆదేశాల మేరకే పనిచేస్తుంది!
*****
11. మిజోరం అనే చిన్న రాష్ట్రం పూర్తిగా క్రైస్తవ మెజారిటీ కలిగి ఉంది!

12. మిజోరం కూడా చర్చి ఆదేశాల మేరకే పనిచేస్తుంది! ఆదివారం టీ కూడా దొరకదు. ఆదివారం అన్ని షాపులు మూసేస్తారు కాబట్టి మంచినీళ్ళ సీసా కూడా దొరకదు కొనాలంటే.

13. మిజోరం లో శాసన వ్యవస్థ ఉన్నా ఆదివారం చర్చిలో ఇచ్చిన ఆదేశాల మేరకే ప్రజలు నడుచుకుంటారు కాబట్టి చర్చి చాలా సులభంగా మ్యానిపులేట్ చేయగలదు ప్రత్యేక క్రైస్తవ దేశం కోసం!

14. బంగ్లాదేశ్ లోని చత్తోగ్రామ్ (Chattogram) పర్వత ప్రాంతాలలో ఉన్న గిరిజనులు కుకీ చిన్ గిరిజన లతో సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే మిజోరం లోని కుకీ చిన్ లతో కూడా సంబంధాలు ఉన్నాయి.
So! మూడు దేశాల సరిహద్దుల వెంట ఉన్న ప్రాంతాలతో కలిపి చిన్న క్రైస్తవ దేశం ఏర్పాటు చేస్తే తరువాత దానిని ఇజ్రాయేల్ లాగా అభివృద్ధి చేసి ఒక ఆట ఆడుకోవచ్చు!

********
జులై 1,2024. వాషింగ్టన్ !
అమెరికన్ కాంగ్రెస్ ఒక బిల్లు ప్రవేశపెట్టింది!
8863 the బ్రేవ్ బర్మా యాక్ట్! The Brave Burma Act!
ఈ బిల్లు బర్మాలో సైనిక నియంత ప్రభుత్వం ప్రజల మీద అణిచివేత ధోరణి ను అమలు చేస్తున్నది కాబట్టి బర్మా సైన్యాధికారుల ఆస్థులు,వ్యాపారాలు, ఆయుధ దిగుమతులు డాలర్ల రూపంలో జరిగే ప్రతీ లావాదేవీలను స్తంభింప చేయడానికి అమెరికా అధ్యక్షుడుకి అధికారాలను కట్టబెడుతున్నది!
మానవతా దృక్పథంతో అమెరికా ఈ బిల్లు ప్రవేశపెట్టింది అని అనుకోవచ్చు కానీ ఈ బిల్లు వెనుక కుట్ర దాగి ఉంది!

జులై నెలకి ముందు కుకీ చిన్ రెబెల్ గ్రూపు సభ్యులు ఓ యాభై మంది బర్మా సరిహద్దులు దాటి భారత్ లోని మిజోరం రాష్ట్రం లోకి ప్రవేశించారు!
బర్మా సైన్యం హెలికాప్టర్ గన్ షిప్స్ తో ఆకాశం నుండి కాల్పులు జరపడంతో కుకీ చిన్ రెబెల్ గ్రూపు సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్ లోకి వచ్చారు. సరిహద్దులు దాటి దాడి చేయడానికి బర్మా సైన్యం ముందుగా ఎలాంటి అనుమతి భారత్ నుండి తీసుకోనందున బర్మా హెలికాప్టర్లు భారత్ లోకి రాలేదు.

ఇక్కడే అసలైన మర్మం దాగి ఉంది! The Brave Burma Act అనేది బర్మా సైన్యాధికారులతో పాటు మొత్తం సైన్యానికి సహాయం అందకుండా బలహీనపరిచి కుకీ చిన్ రెబెల్ గ్రూపు పరోక్షంగా పై చేయి సాధించాడానికే!
చివరికి సైన్యం దిగివచ్చి అడవులలో ఉన్న మీ ప్రాంతానికి అటానమస్ స్టేటస్ ఇస్తాము అని సైన్యం చేత అనిపిస్తారు! ఒక సారి అటానమస్ స్టేటస్ వచ్చాక కుకీ చిన్ రెబెల్ గ్రూపు మేము మిజోరం మరియు బంగ్లాదేశ్ లో ఉన్న చిత్తోగ్రామ్ తో కలిసి పోతాము అంటారు!
**********
చిత్తోగ్రామ్ లోని కుకీ చిన్ గిరిజన క్రైస్తవులు చేత ఇప్పటికే ఆయుధాలు పట్టించి తరుచూ దాడులు చేయిస్తున్నది చర్చి!
So! బంగ్లాదేశ్ లో కూడా ఒక గ్రూపు బంగ్లా సైన్యంతో తలపడడానికి సిద్ధంగా ఉంది!

ఇక మిగిలింది భారత్ లోని మిజోరం!
దశాబ్దాలుగా మిజోరాం రాష్ట్ర ప్రజలు తమకి తాము యూరోపియన్ దేశాలతో పోల్చుకుంటూ వస్తున్నారు!
మనలో చాలా మంది చూసిఉన్నాం కదా!
ఓహ్! ఇది యూరోపియన్ దేశం కాదు మనదేశంలోనే !
No Honking ! No Overtaking! The Quiet city of Aizawl !
అనే ట్యాగ్ లైన్ తో మిజోరం రాజధాని ఐజ్వాల్ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు ఒక దాని వెనుక ఒకటి క్రమశిక్షణతో నిలిపి ఉంచడం, ఎదురుగా వచ్చే వాహనాలకు కుడివైపు రహదారిని ఖాళీగా ఉంచడం ఉన్న ఫోటోలు, వీడియో లు వైరల్ అవడం!

********
ఇంతకీ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలు, బర్మా, బంగ్లాదేశ్ లోకి ఆయుధాలు ఎక్కడినుండి వస్తున్నాయి?

గోల్డెన్ ట్రాయాంగిల్ సౌత్ ఈస్ట్ ఆసియా ! Golden Triangle of Southeast Asia !
నార్త్ఈస్టర్న్ బర్మా, నార్త్ వెస్ట్రన్ థాయిలాండ్, లావోస్ దేశపు ఉత్తర భాగం ల మధ్య ఉన్న పర్వతాలు, అడవులు ఉన్న ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాన్గిల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా అని పిలుస్తారు. 2లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది!
ఓపియం, హెరాయిన్ లకి కేంద్రస్థానం గోల్డెన్ ట్రయాంగిల్!
బర్మా సైన్యం కి ప్రధాన ఆదాయ వనరు డ్రగ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చే డాలర్లు!

గోల్డెన్ ట్రయాంగిల్ లో ఉన్న డ్రగ్ లార్డ్స్ ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంటారు బర్మా, బంగ్లాదేశ్, భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకి.
పాకిస్ధాన్ ISI, అమెరికన్ CIA కీ డ్రగ్ మాఫియా తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి 1970 వ దశకం నుండి.
ISI కి డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి అన్నది నేర్పింది CIA అన్న ఆరోపణలు ఉన్నాయి.
*********
ఇక బంగ్లా ప్రధాని షేక్ హసీనా కి డ్రగ్ మాఫియా తో ఇబ్బందులు ఏర్పడకుండా గత పదేళ్ళలో RAW సహకరిస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు అజిత్ దోవల్ డ్రగ్ మాఫియా ఆయుధాల తరలింపు మీద ఇన్ఫుట్స్ ఇస్తూ రావడం వలన గత పదేళ్ళలో బంగ్లాదేశ్ లో కుకీ చిన్ గిరిజన లతో ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకుంది!
So! హసీనా ను తప్పిస్తే కానీ పని జరగదు ఎందుకంటే అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నంతకాలం భారత ప్రభుత్వం విదేశీ కుట్రల గురుంచి సమాచారం ఇస్తుంది అదే అవామీ లీగ్ పార్టీ కాకుండా వేరే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా భారత్ నుండి సమాచారం రాదు.
Contd…part 5