బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VHP జాతీయ అధికార ప్రతినిధి Dr.రావినూతల శశిధర్ పాల్గొని మాట్లాడుతూ “బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మతోన్మాద జీహాద్ కారణంగా జరుగుతున్న హిందువుల హత్యలు , అత్యాచారాలను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఈ సంక్షోభ సమయంలో భారతీయ సమాజం బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలని” పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించేందుకు భారత ప్రభుత్వం అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసి భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి పంపుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రామారావు, శ్రీనాథ్, ప్రదీప్, నరేష్ , నగేష్, విజయ్ రాథోడ్, విష్ణువర్ధన్, అర్చన, శోభన, జ్యోత్స్న , వినోద్ లతో పాటు ATF కన్వీనర్ బ్రహ్మచారి తదితరులతో పాటు పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు.