దసరా .. దీపావళి . . ఈ రెండు పండగలు వాహన కంపెనీలకు కీలకమైన పండగలు. ఈ సమయంలో కొనుగోలుదారులకు సెంటిమెంట్ కూడా. అయితే ఈ సీజన్ మాత్రం వాహన కంపెనీలకు ఎందుకు దెబ్బ కొట్టింది . కార్ల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి ? ??
ఈ ఏడాది పండగ సీజన్ ప్రయాణికుల వాహన కంపెనీలకు అంతగా కలిసిరాలేదు. అక్టోబరులో కార్ల టోకు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. డీలర్ల వద్ద వాహన నిల్వలు గణనీయంగా పెరిగి ఉన్నాయి
హ్యుండయ్ మోటార్స్
ఈ కంపెనీ దేశీయ విక్రయాలు అతి స్వల్పంగా పెరిగి 55,568 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎస్‌యూవీ మోడళ్లకు అధిక డిమాండ్ నెలకొందని, ఫలితంగా గత నెలలో రికార్డు స్థాయిలో 37,902 ఎస్‌యూవీల అమ్మకాలు జరిపినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీయ విక్రయాల్లో ఎస్‌యూవీల వాటానే 68 శాతమని హ్యుండ య్ మోటార్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు.
మారుతికి ఎగుమతుల దన్ను
మారుతి సుజుకీ కంపెనీ దేశీయ విక్రయాలు 1,59,591 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాదిలో ఇదే నెలకు అమ్మకాలు 1,68,047 యూనిట్లుగా ఉన్నాయి. అయితే, గతనెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు (ఎగుమతులతో సహా) మాత్రం 4 శాతం పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతేకాదు, గతనెలలో కంపెనీ చరిత్రలో అత్యధిక రిటైల్ విక్రయాలు నమోదైనట్లు మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. తద్వారా తమ డీలర్ల నెట్‌వర్క్ వద్దనున్న వాహన నిల్వలను 40,000 యూనిట్ల మేర తగ్గించుకోగలిగామన్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు మాత్రం 25 శాతం పెరిగి 54,504 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం విక్రయాలు 20 శాతం వృద్ధి తో 96,648 యూనిట్లకు పెరిగాయి.
టాటా మోటార్స్ కార్ల దేశీయ విక్రయాలు గత నెలలో 48,131 యూనిట్లకు తగ్గాయి. గతంతో పోలిస్తే ఈ తగ్గుదల శాతం ఎక్కువనే చెప్పాలి .