రీతూ చౌదరి.. బలిపశువేనా ?

వైసీపీ హయాంలో (2021-2023) ఏపీలో రూ 700 కోట్ల భూ కుంభకోణంలో . . టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి ప్రమేయం ఉందా ? ఈ టోటల్ ఎపిసోడ్ లో ఆమె బలిపశువేనా ?

అప్పటి అధికార పార్టీ ముఖ్యనేతలకు బినామీలే ఈ కేసులో బుక్ అయ్యారా ? అసలు దొంగలను ప్రభుత్వం పెట్టుకుంటుందా ? ఇటీవల వెలుగుచూసిన అన్ని కేసులు మాదిరిగా ఈ కేసును కూడా కూటమి నేతలు అటకెక్కిస్తారా ?

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం , విశాఖ బియ్యం స్మిగింగ్ కుంభకోణం , విజయనగరంలో వెయ్యి కోట్ల భూ కుంభకోణం . కడప , నెల్లూరు , మదనపల్లి భూ కుంభకోణాలు మాదిరి . . ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకున్న భారీ కుంభకోణం కూటమి పెద్దల సహకారంతో పక్కకుపోతుందా ? అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి .

విజయవాడ , విశాఖపట్నం , కాకినాడ , రాజమండ్రి , కడియం తదితర ప్రాంతాలకు చెందిన భూములను ఇబ్రా హీంపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి .   వందల ఎకరాల భూములు.. వందల కోట్ల రూపాయల విలువ. నలుగురైదుగురు . . వ్యక్తుల పేర్లతో ఒకే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రోజుల  వ్యవధిలో జరిగిపోయాయి. ఇందులో ప్రభుత్వ భూములు, న్యాయవివాదాలలో పెండింగ్ లో ఉన్నవి, కొందరిని బెదిరించి రాయించుకున్న భూములు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయ్. 

 అక్రమ లావాదేవీలు జరిగిన ఆస్తుల విలువ రూ.106 కోట్లు ఉంటుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేశారు. శ్రీకాంత్‌ భార్య, తండ్రి, ఇతర కుటుంబసభ్యుల పేర్లతో మరెన్నో ఆస్తుల లావాదేవీలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. అంటే ధర్మసింగ్‌ తన లేఖలో పేర్కొన్నట్లు ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.650- 700 కోట్లు ఉంటుందని అంచనా. 

ఈ వ్యవహార0లో టీవీ నటి, జబర్ దస్త్ నటి వనం దివ్య అలియాస్  రీతూ చౌదరి, ఆమె భర్తగా చెపుతున్న చీమకుర్తి శ్రీకాంత్  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో హనీట్రాప్ వ్యవహారం కూడా దాగి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయ్. దీనిపై పోలీసు అధికారులు మాత్రం ఇంకా స్పందించడంలేదు. రీతూ చౌదరి మాత్రం తనకు తెలియకుండా సంతకాలు చేయించుకున్నారని , ఈ భూముల వ్యవహారం తనకు సంబంధంలేదని చెపుతోంది . శ్రీకాంత్ కి రీతూ చౌదరి రెండవ భార్య . రీతూ పేరుతో జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్స్ మాత్రం అప్పటి అధికార పార్టీ నేతలు వద్ద ఉన్నట్లు కూడా చెపుతున్నారు .

2023 నవంబర్‌లో అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడైన లాలా బాల నాగ ధర్మ సింగ్‌  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లకు రాసినట్లు చెపుతున్న లేఖలో అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. సింగ్ నాలుగు నెలల క్రితం రాసిన లేఖ ఇపుడు బయటకు రావడం, సీయఓ  దృష్టికి వెళ్లినా ఇంతవరకు చర్యలు చేపట్టకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

జగన్ సోదరుడు వైఎస్‌ సునిల్, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి, సినీ నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ లపై ఆరోపణలు చేశారు. వీరు తనను బెదిరించి..  విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి , కడియం ప్రాంతాలలో లో కోట్ల రూపాయల విలువ చేసే భూములను   తనతో బలవంతంగా రిజిస్టర్‌ చేయించుకున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో సింగ్‌ పేర్కొన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద ఈ రిజిస్ట్రేషన్లు అన్నీ ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యలయంలోనే జరిగాయి. వీటిలో అసలు భూ యజమానులు కాకుండా, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్లు చేసినట్లు సింగ్ ఏసీబీ అధికారులకు ఇచ్చిన స్టేట్ మెంట్స్ లో పేర్కొన్నట్లు చెపుతున్నారు. సదరు కీలక నేతల నుంచి  బెదిరింపులకు భయపడి  తనకు రక్షణ కల్పించాలని సింగ్ లేఖలో  కోరాడు .  

సింగ్ అక్రమాలను అడ్డుపెట్టుకుని.. 

2021-2023 మధ్య కాలంలో సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ రిజిస్ట్రేషన్లలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు. వీటిని అడ్డంపెట్టుకుని అప్పటి అధికార పార్టీ నేతలు, అత్యున్నత కీలక పదవిలో ఉన్న నేత వ్యక్తిగత కార్యదర్శి ,  ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అధికార పార్టీ నేత ఒకరు సింగ్ ను బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్ల విలువైన భూములను రాయించుకున్నట్లు ప్రాధమిక విచారణలో తేలినట్లు సమాచారం. 

రూ 650-700 కోట్ల విలువైన భూముల స్కామ్ లో బాధితులు ఎవరైనా ముందుకు వచ్చారా? ఈ భూములు ప్రభుత్వ, ఎండోమెంట్ ల్యా0డ్స్ అవ్వడం వల్ల వీటిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదా? వంటి అంశాలపై చర్చ నడుస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్ల సమయంలో కొన్ని అంశాలు బయటలు వచ్చినా.. అప్పట్లో వైసీపీ సర్కార్ పెద్దల ఒత్తడితో వ్యవహారం బయటకు పొక్కకుండా గప్ చిప్ చేసినట్లు చెపుతున్నారు.

సర్కారు ఏం చర్యలు తీసుకుంటుంది?  

ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.600-700 కోట్లు విలువ చేసే ఆస్తులను అప్పటి అధికార పార్టీ అండదండలతో..  ఓ  ముఠా కొట్టేసినట్లు  వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌  రాష్ట్ర సీఎం చంద్రబాబు, అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ లకు  ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖ రాసి.. ఫిర్యాదు చేశారు .   అయితే.. ఇక్కడ ముఖ్య విషయం ఎంటంటే… అప్పటి సీఎం  YS జగన్ మోహన్ రెడ్డి  సోదరుడు YS సునిల్, జగన్ PA నాగేశ్వర్ రెడ్డి పేర్లు  కూడా తెరపైకి వచ్చాయి.  

గత ప్రభుత్వ హయాంలో అంటే సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నప్పుడే…  విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కోట్లు విలువ చేసే ఆస్తులను తనతో బలవంతంగా రిజిస్టర్ చేపించుకున్నారని లేఖలో పేర్కొన్నారు  ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్. నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున భూలావాదేవీలు జరిగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారుల విచారణలోనూ ఈ విషయాలు నిజమేనని తేలింది. లింకు డాక్యుమెంట్లను కూడా ఒకే రోజు రిజిస్టర్‌ చేసినట్లు వెల్లడైంది. వీటిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. 

 చీమకుర్తి శ్రీకాంత్ ఎవరు?

 ధర్మ సింగ్ సీఎం కి రాసిన లేఖలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి, పర్సనల్ పీఏ కె నాగేశ్వర రెడ్డి (KNR), చీమకుర్తి శ్రీకాంత్, ఆమె రెండవ భార్యగా చెపుతున్న వనం దివ్య (రీతూ చౌదరి) పేర్లు వినిపిస్తున్నాయి . .   KNR, సునీల్ రెడ్డిలకు లాబీయింగ్ చేయడం, బినామీ వ్యవహారాలను చక్కబెట్టిన వారిలో చీమకుర్తి శ్రీకాంత్ కీలకమైన వ్యక్తిగా చెపుతున్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతోనూ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కొన్ని ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. 

సింగ్ అక్రమాలను అడ్డంపెట్టుకుని . .

ధర్మ సింగ్.. గతంలో చేసిన రిజిస్ట్రేషన్ అక్రమాలను DR రామారావు ద్వారా తెలుసుకున్న సదరు అధికార పార్టీ పెద్దలు . . అతనిని బెదిరించి.. ఏసీబీ దాడులు చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెపుతున్నారు .  

తనను శ్రీకాంత్ ట్రిప్ పేరుతో గోవా తీసుకువెళ్లి.. అక్కడ నిర్బంధించి.. తన కుటుంబ సభ్యులను బెదిరించి.. కోటి రూపాయలు వసులు చేసిన తర్వాత విడిచిపెట్టారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ధర్మ సింగ్. 

వందల కోట్ల విలువైన అక్రమ రిజిస్ట్రేషణలు చేసినా.. KNR టీమ్ వదలకుండా.. మరింత ఒత్తిడి చేసారని.. ఇక తన వల్ల కాదని చేయకపోతే.. 2023 నవంబర్ 17న తన కుమార్తెలు, అల్లుళ్ళ ఇళ్లపై, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులను పంపి.. ఈ ఆస్తులన్నీ ధర్మ సింగ్ బినామీ అని చెప్పాలని బెదిరించినట్లు కూడా ధర్మ సింగ్ లేఖలో ఆరోపించారు. కొల్లూరులో తమ కుటుంబం విరాళాలతో అభివృద్ధి చేసిన ఆలయాల ఖర్చులు కూడా తమ ఖాతాలో చూపి.. ఏసీబీతో బెదిరింపులకు దిగినట్లు  సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.  

కాల్ డేటాపై ఏసీబీ ఫోకస్..

      సింగ్ చేసిన ఆరోపణలు, ఫిర్యాదులపై సీఎంవో, ఏసీబీ వేర్వేరుగా ఆరా తీస్తున్నారు. సింగ్ పేర్కొన్న  జగన్ అప్పటి పీఏ KNR, వైఎస్ సునీల్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరి, రిటైర్ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తున్నారు. 

    వీరితో సన్నిహితంగా ఉండే వారి కాల్ డేటా, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక MLC, అతని గన్ మెన్లు, పేయేలా కాల్ డేటా పై ద్రుష్టి సారించినట్లు చెపుతున్నారు.

     ఇబ్రాహీం పట్నం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంల్లాంటివి ఎన్ని చోట్ల జరిగి ఉంటాయి? ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కాజేశారు… వీరితో పాటు.. ఇంకా ఎన్ని ముఠాలు ఉన్నాయ్? వంటి వాటిపైనా అధికార యంత్రాంగం దృష్టిసారించాలని పలువురు సూచిస్తున్నారు. 

    ఫ్రీహోల్డ్ ముసుగులో 22ఎ నిషిద్ధ జాబితాలోని భూములను తొలగించి వేల ఎకరాలు కాజేశారు. నయానో భయానో సబ్‌రిజిస్ట్రార్లనూ దారికి తెచ్చుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. చీమకుర్తి శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో జరిగిన అక్రమ భూ లావాదేవీల ఘటన గత సర్కార్లో జరిగిన వేల అక్రమ రిజిస్ట్రేషన్లలో కొన్ని  మాత్రమే అని చెపుతున్నారు. 

    రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ వ్యవహారాలపై సిట్ వేసి లోతైన దర్యాప్తు జరిపితే అప్పటి అధికార పార్టీ పెద్దలతో పాటు , ఐఏఎస్ అధికారుల ప్రమేయం కూడా వెలుగులోకి వస్తుందని రిజిస్ట్రేషన్ అధికారి ఒకరు చెపుతున్నారు .