మన సంస్కృతి ని రక్షిద్దాం..

సేవ్ కల్చర్ . . నినాదంతో దేవిన సిస్టర్స్ రూపొందించిన సైకత శిల్పం యువతకు సందేశం .

జాతీయ , అంతర్జాతీయ0గా ప్రముఖ దినోత్సవాలు వస్తే . . చిన్నారులు ఏమి చేస్తారు . స్కూల్స్ , కాలేజీలకు సెలవు అని .. సరదాగా తోటి పిల్లలతో ఆటలాడేందుకు ఉత్సాహం చూపుతారు . ఇంకొందరు చదువులకు పరిమితమవుతారు . తోటి విద్యార్థులతో చదువులో పోటీపడుతూనే . . సెలవు దినాలలో తమకు ఇష్టమైన వ్యాపకాన్ని ఎంచుకున్నారు .

తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సాహిత (15), దేవిన ధన్యత (13) సైకత శిల్పులుగా పేరొందారు. ఆరేళ్లుగా ఈ విద్యను నేర్చుకుని . . ఇందులో నిష్టాతులయ్యారు .

దేవిన సాహిత , ధన్యతల తండ్రి దేవిన శ్రీనివాస్ . . ఆర్టిస్ట్ . ప్రముఖ సైకత శిల్పి . ఈ విద్యను అతను స్వయంగా నేర్చుకున్నారు . పలు జాతీయ , అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో పాల్గొన్నారు . ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు ఆయా ఉత్సవాలలో సైకత శిల్పాలు వేసేందుకు గతంలో ఇతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు .

జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం , 13, 14, 15 తేదీలలో భోగి , సంక్రాంతి , కనుమ . . ఈ రెండు అకేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ”మన సంస్కృతిని రక్షించుకుందా 0.. అనే నినాదంతో దేవిన సిస్టర్స్ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు . తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సాయినగర్ లో వీరి ఇంటివద్దే ఈ శిల్పం రూపొందించారు . దీనిని చూసేందుకు పలువురు ఇక్కడికి వస్తున్నారు .