wait and see.. అమరావతిలో “భూమ్” స్తబ్దత ఎందుకు ?

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి భూముల ధరలు అప్పటి నుంచీ ఎందుకు స్తబ్ద0గా ఉండిపోయాయి .  కూటమి పాలన మొదలై వంద రోజులు దాటినా క్యాపిటల్ సిటీ అమరావతిలో స్థలాల కొనుగోళ్లు ఎందుకు మందగించాయి . .

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం 15 వేల కోట్లు నిధులు మంజూరుచేసినా ,  పలు జాతీయ ,  అంతర్జాతీయ కంపెనీలు అమరావతి ఏరియాలో పెట్టుబడులకు రెడీ అవుతున్నా . . అనుకుంత స్థాయిలో అమరావతిలో భూములు కొనేందుకు ఒత్సాహికులు ఇంకా జంకుతున్నారు .  2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది .  ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా అమరావతిని సమర్ధించారు .  తర్వాత అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేసారు .  2024లో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చినా . . జగన్ కుట్ర పూరిత ఆలోచనలపై పెట్టుబడుదారులలో భయాలు ఇంకా తొలగిపోలేదు .  2029 లో మళ్ళీ రాజకీయం ఎలా ఉంటుందొ అన్న అనుమానాలతో ఉన్న వారు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు .  అమరావతిలో రేట్లు పెరగకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెపుతున్నారు .  ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున రాజధాని ప్రధాన ప్రాంతాలలో గజం . . 40-50 వేల వరకు ధర పలికింది .  ఇప్పటికీ అవే ధరలు కొనసాగుతున్నాయి . SRM యూనివర్సిటీ ఎదురుగా గజం 70 వేలు పలికెది .  మూడు నెలలలో అది 65 వేలకు తగ్గిందని చెపుతున్నారు .  ముందే రేట్లు పెంచడం వల్ల ఇపుడు కొనేందుకు ఎవరు ముందుకు రావడంలేదని చెపుతున్నారు .  అయితే రాజధాని ప్రాంతంలో ఇపుడున్న రేట్లు పెద్ద రేట్లు కాదని పలువురు చెపుతున్నారు .

”కూటమి అధికారంలోకి వస్తే . . అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేద్దామనుకున్నాం . . కానీ జగన్ ని చూసి భయమేస్తోంది .  అతను ప్రతిపక్షంలో ఉన్నా . . ఎపుడు ఏమి చేస్తాడో తెలియడంలేదు .  చంద్రబాబు ,  పవన్ కళ్యాణ్ మెతక వైఖరి వల్ల జగన్ అండ్ బ్యాచ్ ని కట్టడి చేయలేకపోతున్నారు . ..” అని ఓ బిజినెస్ పర్సన్ అభిప్రాయపడ్డారు .

“ఐదేళ్ల పాలనలో అమరావతిని మట్టుపెట్టిన జగన్ మోహన్ రెడ్డి… అమరావతిపై తన కక్షను ఇంకా వీడినట్లు కనిపించడంలేదు .  తన సోషల్ మీడియా ద్వారా అమరావతిపై ఇంకా విషము చిమ్ముతూనే ఉన్నాడు .  వైసీపీ కుట్రలకు పెట్టుబడిదారులు ఇంకా భయపడుతూనే ఉన్నారు . …” అంటూ ఇటీవల హైదరాబాద్ కి చెందిన విశ్లేషకులు చేస్తున్న హెచ్చరికలు అమరావతిలో లావాదేవీలపై నీలినీడలు అలుముకునేందుకు కారణంగా కనిపిస్తోంది .