BJP Vs TMC : పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమ బెంగాల్ (West Bengal) లో జరుగుతున్న బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్ కతా (Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ (RG Kar Medical College and Hospital) లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు నిరసనగా ఈ బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ బంద్ కు రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు (Student Unions) మద్ధతు తెలిపాయి. బాధితురాలికి సరైన న్యాయం చేయాలంటూ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ (BJP) నిరసనలు, ప్రదర్శనలు ఉద్రిక్తం చేసింది. మరోవైపు బీజేపీ నిరసనలకు పోటీగా టీఎంసీ (TMC) కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పోటాపోటీ నిరసనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.