Vijayawada Railway Stationవిజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత

Vijayawada Railway Station Receives NSG 1 Status రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందింస్తున్నందుకు విజయవాడ స్టేషన్ కు అరుదైన ఘనట దక్కింది .  ప్రయాణికుల రాకపోకలు, వారికి అందుతున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వేస్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏటా రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు ఎన్ఎస్​జీ (NSG-1 -Non Suburban Group 1) హోదా కేటగిరీ ఇస్తారు. దిల్లీ సహా కొన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న టాప్ రైల్వేస్టేషన్లకు మాత్రమే ఇప్పటి వరకు ఈ హోదా ఉండగా తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆ జాబితాల చేరింది. కేంద్ర ప్రభుత్వం విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఎన్ఎస్​జీ 1 హోదా కేటాయించింది. రాష్ట్రంలో ఈ హోదా కలిగిన ఏకైక రైల్వేస్టేషన్ ఇదొక్కటే.