కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డులో వేసే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ గా అడుగులు వేస్తోంది . దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు దర్యాప్తునకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా సీనియర్ ఐఏఎస్ లేదా రిటైర్డ్ జడ్జి .. ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం) సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది .