Illegal Construction Demolition in Kakinada: Followers of Ycp Leader Dwarampudi Chandra Shekar Reddy ..
ఆంధ్రప్రదేశ్ లోనూ హైడ్రా తరహా యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయా ? వైసీపీ నేతలు అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలు కావడంతో ఓననే అనిపిస్తోంది . కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైఎస్సార్సీపీ కీలక నేత , మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలెట్టారు . కాకినాడ సంతచెరువు సెంటర్‌లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని కూల్చివేసారు . గతంలో ద్వారంపూడి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతుల్లేకుండా దుకాణ సముదాయం నిర్మించారనే ఆరోపణలున్నాయి. నెల రోజుల క్రితం అధికారులు నోటీసులు ఇచ్చిన అక్రమ నిర్మాణదారుడి పట్టించుకోలేదు . దీంతో అధికారులు రంగంలోకి దిగారు .