AP Cabinet : ఏపీలో రివర్స్ టెండరింగ్ పాలసీకి స్వస్తి.. కేబినెట్ నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) జరుగుతోంది. ఇందులో భాగంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.

గతంలోని వైసీపీ ప్రభుత్వం (Previous Government) తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ పాలసీ (Reverse Tendering Policy) కి కేబినెట్ స్వస్తి పలికింది. ఈ క్రమంలోనే పాత విధానంలోనే టెండరింగ్ ప్రక్రియ కొనసాగతుందని తెలిపింది. అదేవిధంగా సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించిన కేబినెట్ (Cabinet) వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ (Registration of lands) నిలిపివేతకు ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం చెప్పిన మంత్రివర్గం స్పెషల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని రద్దు (Cancel) చేసింది.