తెలంగాణ (Telangana) లోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని (Runamafi Scheme) అమలు చేసింది.
మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది సర్కార్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రూ.31 వేల కోట్లను రైతుల అకౌంట్ల (Farmers Accounts) లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే మరి కొంతమంది రైతులకు అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు (Ration Card) లేకపోవడం లేదా ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదార్ పాస్ పుసక్తంలో తప్పులు వంటి పలు కారణాలతో కొందరికీ రుణమాఫీ కాలేదు. దీంతో రుణమాఫీ కానీ రైతులపై తెలంగాణ సర్కార్ (Telangana Government) ప్రత్యేక దృష్టి పెట్టింది. రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల (Technical Problems) దృష్ట్యా రైతు భరోసా యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే యాప్ ట్రయల్ పూర్తి కాగా.. యాప్ వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వివరాలను ఈ యాప్ (App) లో నమోదు చేయనున్నారు. అలాగే అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు.
ఈ నేపథ్యంలో ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ (Raithu Bharosha Panta Runamafi App)’ ను తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది. అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతుల నుంచి వివరాలను సేకరించాలని, అనంతరం వాటిని యాప్ లో నమోదు చేయాలని ప్రభుత్వం (Government) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.