కేంద్ర సర్కార్ సహకారం చూస్తుంటే . . పోలవరం ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తీ చేస్తామనిపిస్తోంది . . చంద్రబాబు . . పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్ చేసిందని, ఈ చర్యలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ కి జీవాధారగా పోలవరం మారుతుందన్నారు .
2014-2019 సమయంలోనే పోలవరాన్ని 72 శాతం పూర్తిచేశామని . . వైసీపీ అధికారంలోకి వచ్చాకా పోలవరాన్ని నిర్లక్ష్యం చేసారని చంద్రబాబు విమర్శించారు . 992 కోట్లతో దయాఫ్రొమ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు . వైసీపీ అరాచక తనంతో పోలవరాన్ని , ఆంధ్రరాష్ట్రాన్ని నాశనం చేసారని విమర్శించారు . ఇప్పుడు ప్రజలంతా ఐక్యంగా ముందుకు వచ్చి . . సహకారం అందించి . . రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు . ప్రాజక్ట్ పనులతో పాటు పోలవరం పునరావాస పనులు కూడా చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు .