సౌత్ సూపర్ స్టార్, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నేటికి 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించగా..అందులో చాలా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాయన్న సంగతి తెలిసిందే.
తమిళనాడులోని చెన్నై (Chennai) లో ఆగస్ట్ 29, 1959న నాగార్జున జన్మించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచిన నాగ్.. సినీ ఇండస్ట్రీ (Movie Industry) లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. నాగార్జున మొదట 1984 లో లక్ష్మీ దగ్గుబాటి (Lakshmi Dhaggubati ) ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆరు సంవత్సరాల తరువాత విడాకులు తీసుకున్నారు. లక్ష్మీ నుండి విడిపోయిన రెండు సంవత్సరాల అనంతరం నాగార్జున నటి అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కుమారులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు కూడా హీరోలుగా కొనసాగుతున్నారు.
అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా విక్రమ్ (Vikram) సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన నాగార్జున ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రేమకథా చిత్రాల (Love Movies) తో పాటు భక్తిరస చిత్రాలలో కూడా ఆయన నటించారు.