తమిళనాడు సీఎం కొడుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో మాట్లాడుతూ సనాతన ధర్మం వైరస్ లాంటిదని దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలను తిరుపతిలో పవన్ కల్యాణ్ గుర్తు చేస్తూ… సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు. నీలాంటోళ్లు చాలామంది వచ్చారు. చరిత్రలో కలిసి పోయారని వ్యాఖ్యానించడం తాజాగా మరో వివాదానికి దారి తీసింది.
పవన్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ఇక శుక్రవారం నాడు ఉదయనిధి స్టాలిన్‌ను ప్రశ్నించగా వేచిచూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. డీఎంకే పార్టీ సోషల్ మీడియా వింగ్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తోంది.
అంతేకాదు ఉదయనిధి అనుచరులు ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగుతున్నారు. మీ సోదరుడిని ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోమని చెప్పండి అంటూ చిరును ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులకు సీఎం స్టాలిన్‌తో చిరంజీవి దిగిన ఫొటోలను జోడిస్తున్నారు.
పవన్ కల్యాణ్‌పై తమిళనాడులోని మదురైలో కేసు నమోదైంది. మతాలను రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యానించారంటూ మదురై న్యాయవాది ఒకరు తాజాగా కేసు పెట్టారు.