బీచ్ స్నానం సరదా ఆ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. సంక్రాంతి మూడు రోజులూ ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలలో ముక్కనుమ రోజున విషాదం చోటుచేసుకుంది.
సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు.
– ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఆరుగురు స్నేహితులు సింగరాయకొండ సమీపంలో .. పాకల సముద్ర తీరానికి వెళ్లారు. ముక్కనుము సందర్భంగా వీరంతా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు.
– ఈ క్రమంలోనే అలల తీవ్రతకు ఐదుగురు సముద్రంలోకి కొట్టుకుపోయారు.
– అక్కడే ఉన్న మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.
– నవ్య అనే యువతిని మెరైన్ పోలీసులు కాపాడారు
– ముగ్గురు సముద్రంలో మునిగి మృతి చెందారు.మృతదేహాలను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
– మృతులు పోన్నలూరు మండలం శివన్న పాలెంకు చెందిన మాధవ (26), జెస్సికా (16), యామిని(19)లుగా గుర్తించారు.తన్నీర్ పవన్ అనే వ్యక్తి గల్లంతయ్యారు. అతని కోసం గాలిస్తున్నారు.
మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు దగ్గరలోని పొన్నలూరు మండలం శివన్న పాలెంకు చెందిన వారుగా గుర్తించారు. మృతులు జెస్సిక, నోసిన మాధవ, యామినిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
