ATP: నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు

నసనకోట క్షేత్రంలో జరిగిన దోపిడీ 6.50కోట్లు బుధవారం రోజు జరిగిన వేలం పాటే ఇందుకు సాక్ష్యం ఒక్క ఏడాదికి వచ్చే ఆదాయం కోటిన్నర రూపాయలు ఐదేళ్లలో వారు చూపిన ఆదాయం కోటి రూపాయలే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్యాచ్ పై గ్రామస్తులు ఆగ్రహం దీనిపై విచారణ చేయించి..చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి క్షేత్రంలో గత ఐదేళ్లలో ఆరున్నర కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని నసనకోట … Read more

 AP: ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయవచ్చు: ప్రభుత్వం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం అమల్లోకి తెచ్చినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు.

NELLORE: ఘనంగా చేనేత దినోత్సవం

జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేతన్నలకు బాసటగా నిలవాలని కోరారు. చేనేత ఐక్యవేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ , బుచ్చిరెడ్డిపాలెం మండలం బీజేవైఎం మండల అధ్యక్షుడు గోలి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.