Nominated Posts in AP: నామినేటెడ్ పోస్టులు వచ్చేస్తున్నాయ్ . .

”ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ,  జనసేన ,  బీజేపీ కూటమి కేడర్ కి ఉత్సాహం రేకెత్తించే ప్రకటన ఇది .  ఆయా పార్టీలలో ఇప్పటి వరకు ఎటువంటి పదవులూ లేని ,  కష్టపడే నేతలు ,  కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూటమి సర్కార్ రెడీ అయింది .  ఈ మేరకు పార్టీల వారీగా నామినేటెడ్ జాబితా కూడా రెడీ అయింది . .”

  సోషల్ మీడియాలో ఏపీ లో  నామినేటెడ్ పోస్టుల ఎంపిక జరిగిందని . . ఒకటి ,  రెండు రోజులలో జాబితాను అధికారికంగా ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది .    కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లుో ఈ లిస్టులో ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ప్రాధాన్యం ఇచ్చారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు .  ఈ జాబితాలో  టీటీడీ ఛైర్మన్ తో పాటు . . మరో ఇరవైకి పైగా  పేర్లు వైరల్ అవుతున్నాయి .   

టీటీడీ ఛైర్మన్‌గా టీవీ5  ఛానల్ చైర్మన్   బీఆర్ నాయుడు పేరు ప్రస్తావనకు వస్తోంది . ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు.,   ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బొడ్డు వెంకటరమణ చౌదరి.,  ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం చౌదరి,. ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి.. శాప్ ఛైర్మన్‌గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్లు ఈ జాబితాలో కనిపిస్తున్నాయ్ .    మహిళా కమిషన్ ఛైర్మన్‌గా రెడ్డి వాణి.. ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నీలాయపాలెం విజయ్ కుమార్‌,  ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌గా గంప కృష్ణ.. ఏపీ వే ర్  హోసింగ్  కార్పొరేషన్ ఛైర్మన్‌గా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు  సోము వీర్రాజు.. ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డ్ ఛైర్మన్‌గా షేక్ రియాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొబ్బూరి వెంగళరావు.,  ఏపీ గ్రేనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బండ్రెడ్డి రామకృష్ణ., ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్‌గా విష్ణువర్ధన్ రెడ్డి., ఏపీ స్వచ్ఛంద మిషన్ ఛైర్మన్‌గా పాతూరు నాగభూషణం,  ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నిమ్మల క్రిష్టప్ప, ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా అనిమిని రవి నాయుడు తదితరుల పేర్లు  నామినేటెడ్ పోస్టుల జాబితాలో కనిపిస్తున్నాయ్ .  అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు .