మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి న్యాయస్థానాలు అంటే లెక్క లేదు . ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కోర్టులకు హాజరు మినహియింపు కోరుకున్న జగన్ . .ఇపుడు లండన్ వెళ్ళడానికి ఖాళీగా ఉన్నారు కానీ , , ఖచ్చితంగా హాజరుకావాల్సిన కోర్టులకు మాత్రం హాజరుకావడంలేదు . .
అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కనాడూ కోర్టుకి వెళ్ళలేదు..
వేలాది వాయిదాలు వేసినా ఒక్కరోజూ కుదర్లేదు.. ప్రజాసేవలో ఫుల్ బిజీ.
ఓడిపోయి మూడు నెలలైనా.. ఇంకా ఇప్పటికీ కోర్టుకి వెళ్ళలేదు.. (కోర్ట్ పిలవలేదా?)
ఐదున్నరేళ్ళపాటు ఒక్క గంట కోర్టుకి వెళ్లలేనివాడికి విదేశీ యాత్రలు చేయడానికి మాత్రం బోల్డంత ఖాళీ దొరికింది…
అదేమని అడిగిన దిక్కు, మొక్కూ లేదు దేశంలో!
చట్టం, న్యాయం రొమ్ము విరుచుకోవాల్సిన క్షణాలు!
పాతిక పైగా కేసులు ఉన్న ఎవ్వడికైనా ఇలాంటి అద్భుత అవకాశం భారతదేశంలో దక్కుతుందా?
జాతికి ఏమి సందేశం ఇవ్వదల్చుకున్నారు దీనిద్వారా?
డబ్బు, పదవి కలిస్తే ఏదైనా చేయొచ్చు ఇండియాలో అనేనా!!
“సామాన్య నేరస్తుడు” రెండు వాయిదాలకు వెళ్లకపోతే ఏమి చేస్తారు?
చివరికి కంప్లయింట్ చేసినవాడు నాలుగైదు వాయిదాలు హాజరవ్వకపోయినా న్యాయస్థానం ఊరుకోదు కదా!
మరి ఈ ఒక్కని విషయంలో ఎందుకింత ప్రత్యేకం?
అందరికీ ఒక్కటే అని చెప్పబడే రాజ్యాంగం, చట్టం అన్నీ ఇలా ఒక్కడి కోసం రూపుని, తీరుని మార్చేసుకుంటే ఎలా?
ఆయనని ఇప్పటికైనా కోర్టుకి పిలవమని జాతి కోరడం లేదు..
అందరికీ ఇలాంటి అద్భుత అవకాశాన్ని కల్పించమని మాత్రం కోరుకుంటోంది.
నిజానికి అతగాణ్ణి కోర్టు ముందు నిలబెట్టడంకంటే.. అందరికీ ఈ ఛాన్స్ ఇవ్వడమే ఈజీ కావచ్చు! ఆలోచించండి.. జగన్ మోహన్ రెడ్డి ని అభిమానించే
జనం అయితే మాత్రం ఆడు మగాడ్రా బుజ్జీ అనుకుంటున్నారు!!
ఈ ధోరణి సమాజానికి ఎంత ప్రమాదమో విజ్ఞులు ఆలోచించాలి .