Minister Anagani Satyaprasad: వైసీపీ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Angani Satyaprasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర ( AP State) వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారని తెలిపారు.
మదనపల్లె ఫైళ్ల దహనం కేసు (Madanapalle file burning case) విచారణ వేగంగా జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. పెద్దిరెడ్డి (Peddireddy) అనుచరుల ఇళ్లల్లో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయని ఆయన పేర్కొన్నారు. మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాలు కబ్జా చేసినట్లు ఆధారాలు (Evidence) ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గతంలోని వైసీపీ ప్రభుత్వ ( Previous YCP Government) హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను (All Scams) బయటపెడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.