Liquor Shops Allotment Process in AP : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు – మంత్రి నారాయణ 100 దరఖాస్తులు చేస్తే ఎన్ని వచ్చాయో తెలుసా?

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఉండగా అందులో 10 శాతం అంటే 345 దుకాణాలను కేవలం మహిళలే దక్కించుకున్నారు. ఈ లాటరీ ప్రక్రియ ఆయా జిల్లాల్లోని కలెక్టర్ల పరిధిలో జరిగాయి. ఈ నెల 14 (సోమవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. విజయవాడ సహా కొన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు జాక్​పాట్​ కొట్టారు. అక్టోబరు 16 నుంచి వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

అయితే మంత్రి నారాయణ,ఎన్నికల్లో విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం నెల్లూరు జిల్లాలో తన సొంత డబ్బులు రూ.2 కోట్లతో మద్యం దుకాణాలకు 100 దరఖాస్తులు వేశారు. లాటరీలో వీరికి మూడు దుకాణాలు దక్కాయి. ఒక్కో దుకాణాన్ని ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది నిర్వహించే విధంగా మంత్రి నారాయణ లైసెన్సులను అందించారు.