ఏపీ రాజధాని అమరావతి (Capital Amaravati) నిర్మాణంపై కీలక అప్ డేట్ (Update) బయటకు వచ్చింది. రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
డిసెంబర్ ఒకటోవ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు (Construction works) మొదలవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. నాలుగేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని పేర్కొన్నారు. కేపిటల్ నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ఉత్తమ నగరం (World’s Best City)గా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. అమరావతితో పాటు మిగిలిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి (Development) చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కాగా కృష్ణా జిల్లా (Krishna District) కంకిపాడులో క్రెడాయ్ సౌత్ కాన్ (Credai South Conn) సదస్సుకు హాజరైన మంత్రి నారాయణ రాజధాని నిర్మాణంపై ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.