Driverless  Vehicles in Secretariat:ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ వాహనాలు

 

   లేటెస్ట్ టెక్నాలజీ  సంతరించుకున్న ఏపీ  సెక్రటేరియట్  – విజయవంతమైన డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాల ట్రయల్ రన్

 వాహన  డ్రైవింగ్ లోనూ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం రానురాను పెరుగుతోంది. ఐటీలోనే కాకుండా.. AI ని అన్ని రంగాలలోకీ చొప్పిస్తున్నారు. 

ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధులు రూపకల్పన చేసిన ఈ వాహనాలను ఉద్యోగులు, సందర్శకుల రాకపోకల కోసం ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

డ్రైవర్ రహిత వాహనాలు : ఏపీ సచివాలయం ఆధునిక సాంకేతికతను సంతరించుకుంటోంది. డ్రైవర్ రహిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలను ప్రయోగాత్మకంగా సచివాలయంలో పరీక్షించారు. ఐఐటీ హైదరాబాద్​కు చెందిన విద్యార్ధులు రూపొందించిన ఈ వాహనాలను సచివాలయంలో వినియోగించాలని భావిస్తున్నారు. జీపీఎస్ టెక్నాలజీ ద్వారా సచివాలయంలో నిర్దేశించిన మార్గాల్లో ఈ వాహనాలు ప్రయాణించేలా ప్రోగ్రామింగ్ డిజైన్  చేశారు.

ట్రయల్ రన్ విజయవంతం : ఈ తరహా రెండు వాహనాలను ప్రస్తుతం సచివాలయంలో ఉద్యోగులను, సందర్శకులను ప్రయాణించేందుకు వినియోగించనున్నారు. డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఈ వాహనాల ట్రయల్ రన్ విజయవంతమైంది. సచివాలయానికి వచ్చే సిబ్బందిని, విజిటర్స్​ను వివిధ బ్లాక్​లకు తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను వినియోగించాలని ప్లాన్ చేశారు.  సచివాలయ ప్రాంగణంలోని మెయిన్ గేట్ నుంచి ఐదు బ్లాక్​లకు రాకపోకలు సాగించేలా ఈ డ్రైవర్ లెస్ వాహనాలకు ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ (AI ) ప్రోగ్రామింగ్ చేశారు.

మనుషులు అడ్డొస్తే..  : ఏదైనా వాహనం లేదా మనుషులు అడ్డుగా వస్తే దానంతటదే ఆగుతుంది. ఆటోమేటిక్  బ్రేక్ పడేలా ఈ వాహనాలకు ప్రోగ్రామింగ్ చేశారు. ప్రస్తుతం ఈ డ్రైవర్ లెస్ వాహనాలు సందర్శకులను, ఉద్యోగులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి టెక్నాలజీ ఏపీలో ఇతర రంగాలలోనూ వినియోగించాలని అధికారులు యోచిస్తున్నారు.