ఇసుక మద్యం దందాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలు విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇసుక అక్రమ దందా చేసేవాళ్లపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపినిచ్చారు. అలాగే రూ.99కే ఇవ్వాలని అంతకు మించి ఒక్కపైసా వసూళ్లకు పాల్పడినా చర్యలు తప్పవని తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. అంతకు మించి ఒక్క పైసా వసూల్ చేసినా కఠినచర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మార్పీపీ కన్నా ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వొద్దని మందుబాబులకు కూడా సూచించారు.
మద్యం, ఇసుక అక్రమాలను కట్టడి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఏమాత్రం అవినీతికి తావులేకుండా పకడ్బందీ పాలసీలను అమలు చేస్తామన్నారు. పార్టీ శ్రేణులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని పిలునిచ్చారు. పనితీరుతోనే 2029లో అధికారంలోకి వస్తామన్నారు. మద్యం ధర విషయంలో 99 లక్ష్మణ రేఖ దాటినా.. ఇసుక అక్రమ దందా చేసినా … ఇక దారి అత్తారింటికే. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు.. ఎవరు గీత దాటినా చర్యలు ఇక మాములుగా ఉండవంటూ వార్నింగ్ ఇచ్చారు.