bjp: ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ ఆఫీసులో ఉండే తేదీలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ ఆఫీసులో ఉండే తేదీలు
“ వారధి పేరుతో ఏపీ బీజేపీ కార్యక్రమం’’

ఏపీ బీజేపీకి చెందిన కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెల రెండు రోజులు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం పనిచేసేలా “ వారధి’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

1. దగ్గుబాటి పురందేశ్వరి- ప్రతి నెలలో మొదటి సోమవారం, మూడోవ సోమవారం ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

2. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి – ప్రతి నెలలో నాలుగవ సోమవారం,నాలుగవ మంగళవారం.
3. మంత్రి సత్య కుమార్ యాదవ్- ప్రతి నెలలో మొదటి మంగళవారం ,మూడో మంగళవారం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తారు.

4. సుజనా చౌదరి- మొదటి బుధవారం ,రెండొవ బుధవారం అందుబాటులో ఉంటారు.

5.ఎమ్మెల్యే ఈశ్వర రావు- మూడో బుధవారం, మూడో గురువారం .

6. కామినేని శ్రీనివాసరావు- ప్రతి నెలలో మొదటి గురువారం,రెండోవ గురువారం.

7. విష్ణు కుమార్ రాజు – ప్రతి నెలలో నాలుగో బుధవారం, నాలుగో గురువారం అందుబాటులో ఉంటారు .

8. ఎంపీ సీఎం రమేష్ – ప్రతి నెలలో మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం అందుబాటులో ఉంటారు .

9. ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి – ప్రతి నెలలో మూడో శుక్రవారం, మూడవ శనివారం.

10. ఎమ్మెల్యే పార్థసారధి – ప్రతి నెలలో నాలుగో శుక్రవారం, నాలుగో శనివారం.

11. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ – ప్రతి నెలలో మొదటి శనివారం,రెండో శనివారం కార్యకర్తలు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.

12. సోము వీర్రాజు – ప్రతి నెలలో రెండో సోమవారం, రెండో మంగళవారం అందుబాటులో ఉంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు చెప్పే విధంగా జనతా జనార్దన్ అంటే ప్రజలే దేవుళ్లు అనే మాటను నిజం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రతినెలా రెండు రోజులు పార్టీ కోసం కేటాయించాలని పార్టీ నిర్ణయించింది.