కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బిక్కిన విశ్వేశ్వరరావు

భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడుగా బిక్కిన విశ్వేశ్వరరావు  నియమితులయ్యారు .  విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలో ప్రవేశించిన బిక్కిన . . ముందు నుంచీ బీజేపీలోనే ఉన్నారు .  కేంద్ర ,  రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముక్యులతో బిక్కినకు సత్సంబంధాలు ఉన్నాయ్ .  విశ్వేశ్వరరావు ఎంపికపై బీజేపీలోనే కొందరు నాయకులు అడ్డుచెప్పినా ,  పదవి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసినా , , బిక్కిన ఎంపికను ఆపలేకపోయారు .  పెద్దాపురం మండలం కట్టమూరు విశ్వేస్వరరావు స్వగ్రామము .  బిక్కినకు పదవి రావడంపట్ల అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ,  బీజేపీ సీనియర్ నాయకుడు యార్లగడ్డ రామ్ కుమార్ తదితర నేతలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు .