” కోట్లాది మంది హిందువుల మనోభావాల అంశం ఇది . అయినా అప్పటి పాలకులు , కీలక అధికారులకు అదేం పట్టలేదు . కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతు కొవ్వులు నుంచి తీసిన నూనెను కల్తీ చేసిన, అందుకు దోహదం చేసిన , తెలిసినా పట్టించుకోని ఆ పాపాత్ములంతా ఆ శ్రీనివాసుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు . .ఈ దుర్మార్గులకు ఇంకా సపోర్ట్ చేస్తున్న వారికీ ఈ పాపంలో భాగం తప్పకుండా ఉంటుంది . ..”
కలియుగదైవం శ్రీనివాసుడు వేంచేసి ఉన్న తిరుమలలో పొరపాటున తప్పుగా ఆలోచించినా లెంపలు వేసుకోవడం పరిపాటి . కొన్ని క్షణాలు దేవదేవుని దర్శనం కోసం గంటల తరబడి నిలువ కాళ్లపై ఓపిగ్గా నిలబడే ఉంటాం .
ప్రసాదం ఇచ్చేటపుడే . .
తిరుమల ప్రసాదం ఇచ్చేటపుడే చెప్పులు తీసి అతి పవిత్రంగా ఇస్తుంటారు . కళ్ళకు హత్తుకుని తింటారు . అలాంటి ప్రసాదంలో వాడే నెయ్యి కాంట్రాక్టుని కాసులకు కక్కుర్తిపడి మార్చేశారు . కల్తీ కి పాల్పడే వారికి కట్టబెట్టారు . .దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్‌లో చేసిన టెస్టులో నెయ్యి విషయంలో వచ్చిన రిజల్ట్ చూస్తే.. ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించారో . .ఆలోచన చేయడానికే భయం వేస్తుంది . ఎందుకంటే.. ఆ నెయ్యిలో నెయ్యి శాతం కేవలం 19 శాతం మాత్రమే. మిగతా 81 శాతం పనికిమాలిన వాటిని కలిపారట . దానితోనే లడ్డూలు, శ్రీనివాసుడి అన్న ప్రసాదాలు తయారు చేసి కోట్ల మంది భక్తులకు పెట్టారు.
జగన్ అండ్ కో ముందు నుంచీ లైట్ తీసుకున్నారు . . అధికారంలోకి రాగానే వైసీపీ బ్యాచ్ రక్షణ శాఖలో పని చేస్తున్న ధర్మారెడ్డి అనే అధర్మారెడ్డిని తెచ్చి జేఈవోగా నియమించారు. ఆయన జేఈవో అయినా పెత్తనం ఆయనదే. ఈ ధర్మారెడ్డి క్రిస్టియన్ అని.. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణల్ని అప్పట్లో పరిగణలోకి తీసుకోలేదు . తర్వాత జవహర్ రెడ్డి ఈవోగా చేసినపుడు ఇదే పరిస్థితి .
కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా . .. టీటీడీ చైర్మన్ గా అత్యధికా కాలం వైవీ సుబ్బారెడ్డి.. చివరిలో కరుణాకర్ రెడ్డి వ్యహరించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలను ఆన్ లైన్ పెట్టడం కూడా ఆపేశారు. అంతా ఇష్టారాజ్య పాలన. అడిగేవారు లేరు. శ్రీవారి టిక్కెట్ల పేరుతో భక్తుల్ని ఎంత దోచుకున్నారో చెప్పాల్సిన పనిలేదు. వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో.. ప్రజా ప్రతినిధులు వందల టిక్కెట్లు తీసుకుని అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి .
దోపిడీ ఒకెత్తు . . కల్తీ మాత్రం మహా పాపం . .
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. హిందువులకు దేవదేవుడైన శ్రీనివాసుడ్ని ఒక్క క్షణం దర్శనం చేసుకునేందుకు దెస విదేశాల నుంచి వస్తారు. కొండపై ఎన్ని గంటలైనా క్యూ లైన్లలో ఎదురు చూస్తారు. అలాంటి చోట యంత్రాంగం భక్తుల విశ్వాసాలను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏం చేశారు.. ప్రజలు తమకు దోచుకునే అవకాశాన్ని ఇచ్చారని అనుకున్నారు. ఎంత అన్యాయం అయితే.. యాభై ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని బ్రాండ్ నెయ్యిని కాకుండా తక్కువకు ఇస్తారని ఎక్కడి నుంచి తెస్తారో తెలియని కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారా ?. ఆ కంపెనీలు విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని దాన్నే నెయ్యిగా మార్చి పంపిణీ చేస్తే కళ్లు మూసుకుని తీసుకుని లడ్డూల తయారీకి ఉపయోగిస్తారా ?.
శ్రీనివాసుడి శిక్ష నుంచి తప్పించుకోలేరు … విజిలెన్స్ , ఇతర విచారణల నుంచి ఈ కల్తీ బ్యాచ్ . . వారికి అండ దండాలు అందించిన బ్యాచ్ తప్పించుకోవచ్చేమో కానీ , వెంకటేశ్వర స్వామి నుంచి మాత్రం …వీరు నిజంగా జంతువుల కొవ్వులు నుంచి తీసిన నూనెతో కల్తీ చేసి ఉంటె మాత్రం ఏ ఒక్కరు తప్పించుకోలేరు . వైసీపీ బ్యాచ్ దీనిపైనా వితండ వాదం చేయవచ్చు . ఆలా చేసే వారికీ ఈ మకిలి అంటుకుంటుంది . వారికీ ఈ మహా పాపంలో భాగస్వామ్యం వస్తుంది . బీ కేర్ ఫుల్ . రాజకీయ విమర్శల మాదిరిగా దీనిని కూడా తిప్పి కొట్టడానికి టీవీలలోకి వచ్చే ముందు మీకు కుటుంబం ఉందని , పిల్లలు ఉన్నారని మర్చిపోకుండా చూసుకొండి . .