150 కిలోమీటర్ల ఈత.. 58 గంటల సమయం.. విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్ వరకు..

 

  • మరో రికార్డ్ నెలకొల్పిన స్విమ్మర్ గోలి శ్యామల

ఐదు పదుల వయసులోనూ తన సంకల్పబలంతో సముద్రాన్ని ఈది మరోమారు సరికొత్త రికార్డ్ నెలకొల్పింది సామర్లకోటకు చెందిన గోలి శ్యామల. 

ఈమె గతంలో.. 2021లో  30 కిలోమీటర్ల దూరం రామసేతు ఈది ప్రపంచ రికార్డ్ సాధించింది. 

 ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని నిరూపించిన శ్యామల   చెరువులు, నదుల్లో దిగదానికే భయపడే    ఆమె నలభై ఏడేళ్ల వయసులో శ్రీలంక జలసంధిని అవలీలగా ఈదేశారు.  పాక్‌జలసంధి 30 కి.మీ దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో ఈదిన తెలంగాణ తొలి మహిళగా ఘనతను సాధించారు.   ఎంతో క్లిష్టమైన కాటలినా ఛానల్‌ను 10 గంటల 4 నమిషాల 45 సెకన్ల పాటు ఏకబిగిన ఈతకొట్టి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. శ్యామల విజయయాత్ర అక్కడితో ఆగకుండా విశాఖ ఆర్కే బీచ్​ నుంచి కాకినాడ NTR బీచ్ వరకు…  ఏకంగా 150 కిలోమీటర్ల దూరాన్ని ఈది మరోమారు తన  పట్టుదలను నిరూపించుకున్నారు. 

  గతంలో ఈమె కన్యాకుమారి నుంచి శ్రీలంకకు సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారు.  నిత్యం చైతన్యవంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని గతంలో తనను హేళన చేసిన వారే.. తాను సాధించిన స్విమ్ రికార్డులను చూసి..  ఇప్పుడు మెచ్చుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు.  

 విశాఖపట్నం నుంచి కాకినాడ 150 కిలోమీటర్ల దూరాన్ని శ్యామల ఏడు రోజులలో.. 58 గంటల సమయంలో ఈది .. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్ల దూరం ఈది సరికొత్త రికార్డు సాధించారు.