‘సీజ్ ది షిప్ ‘ ఏపీలో ట్రేండింగ్

ఏపీ డిప్ట్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ ఏమి చేసినా సంసేన్షనే . .. అది సినిమా కావచ్చు . . పాలిటిక్స్ కావచ్చు . తాజగా పవన్ కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ అవుతున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు . దీనిపై ఏపీ లో పెద్ద రాద్దాంతమే జరుగుతుంది . పోర్టులో తనిఖీల సందర్బంగా పవన్ ”సీజ్ ది షిప్ ‘ అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు . సీజ్ చేసే అధికారం పవన్ కి ఉందా ? లేదా ? అంతర్జాతీయ చట్టాలు ఇందుకు అనుమతి ఇస్తాయా ? వంటి చట్ట పరమైన అంశాలు పక్కన పెడితే . .. పవన్ చేసిన హడావుడి కాకినాడలో సినీ షూటింగ్ ని తలపించింది .

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో మూడు సినిమాలున్నాయిప్పుడు. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’, ‘వీర‌మ‌ల్లు’ సెట్స్‌పై ఉన్నాయి. ఈ మూడు సినిమాల‌కూ అప్పుడ‌ప్పుడూ కొన్ని కొన్ని డేట్లు కేటాయిస్తున్నాడు ప‌వ‌న్‌. తాజాగా ‘వీర‌మ‌ల్లు’ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. పవ‌న్ కూడా ఈ షెడ్యూల్ లో పాలు పంచుకోనున్నాడు. దాంతో.. మిగిలిన సినిమాల అప్‌డేట్‌ల‌పై ప‌వ‌న్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ‘ఓజీ’ కోసం వాళ్లెంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్ చెప్ప‌మంటూ.. సోష‌ల్ మీడియాలో అభిమానులు నిర్మాణ సంస్థ‌కు రిక్వైస్టులు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే నేరుగా నిర్మాణ సంస్థ కు ఓ అభిమాని ”ఓజీ అప్‌డేట్ ఇచ్చి చావ‌రా..” అంటూ ఎక్స్ వేదిక‌గా ట్యాగ్ చేశాడు. దాంతో నిర్మాణ సంస్థ కూడా బ‌దులు ఇచ్చింది. ”అప్ డేట్ ఇవ్వ‌కుండా చావ‌ను లేరా.. ప్ర‌స్తుతానికి సీజ్ ద షిప్‌” అంటూ స‌మాధానం ఇచ్చింది.

ఎన్నిక‌ల తర్వాత ” పిఠాపురం ఎమ్‌.ఎల్‌.ఏ గారి తాలుకా” అనే స్లోగన్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ఇప్పుడు ‘సీజ్ ద షిప్’ అంత పాపుల‌ర్ అవుతోంది . ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సైనికులు ఈ టాగ్ ని బాగా వైర‌ల్ చేస్తున్నారు.