తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు, సౌమ్యుడుగా పేరుగాంచిన యనమల రామకృష్ణుడు, పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశించిన చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ విషయం టీడీపీ అధిష్టానం మర్చిపోయిందా ? లేక ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిందా ?
కాకినాడ సెజ్ భూములు , దివీస్ భూముల వ్యవహారంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు దోచుకున్నారన్న అర్ధం వచ్చే రీతిలో మాజీ మంత్రి , టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నెల రోజుల క్రితం చంద్రబాబుకు లేఖ రాసారు . ఆ సమయంలో ఈ లేఖను టీడీపీ సీరియస్ గానే తీసుకుంది . అయితే యధావిధిగా తర్వాత దీని విషయాన్నీ మరుగునపడేసింది .
ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి సిద్దమైన రంగం లో యనమల పాత్రపై పలు అనుమానాలు ఉన్నా . . చంద్రబాబు, యనమలతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని చర్యలు లేకుండా వదిలేసినట్లు చెపుతున్నారు .
కాకినాడ పోర్టు చైర్మన్ కె.వి.రావును బాధితుడిగా చూపిస్తూ, వై.సి.పి.ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు, సొంత పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నుంచి చిక్కులు ఎదుర్కోబోతున్నారు. కె.వి.రావు కాకినాడ సెజ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారని, బి.సి. రైతులకు న్యాయం జరగకపోతే పోరాడుతారని యనమల చంద్రబాబుకు రాసిన లేఖ టిడిపి వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే .
టిడిపిలో అత్యంత విశ్వసనీయ నాయకుడు, చంద్రబాబు సన్నిహితుడు అని పేరుగాంచిన యనమల రామకృష్ణుడు అకస్మాత్తుగా పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాన్ని లేవనెత్తడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యనమల కుటుంబంలో నాలుగు పదవులు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్సీ. కూతురు దివ్య.. తుని ఎమ్మెల్యే. అల్లుడు ఏలూరు లోక్‌సభ సభ్యుడు. వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే.
2014-2019 మధ్య, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో, కాకినాడ సెజ్ రైతులపై కేసులు నమోదయ్యాయి. యనమల సోదరుడు యనమల కృష్ణుడు రొయ్యల హేచరీలపై దాడి చేసి పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో చంద్రబాబు ఆయనను మందలించారు కూడా. యనమల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దివీస్ తన నియోజకవర్గంలో భూముల కేటాయింపులో కూడా సహాయం చేశారు. యనమల ఇప్పుడు అదే దివీస్ కంపెనీపై ఆరోపణలు చేస్తున్నారు. యనమల ఎమ్మెల్సీ పదవి త్వరలో ముగియనుంది. రాజ్యసభ టికెట్ ఆశిస్తున్న యనమల పట్ల పార్టీ అనుకూలంగా లేదు. పార్టీ నిర్ణయం యనమలపై కోపం తెప్పించిందని, పదవి లేకుండా ఉండలేకపోతున్నారని తెలుస్తోంది. రాజకీయంగా చంద్రబాబును, పార్టీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆయన చంద్రబాబుకు లేఖ రాశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
-కెవి రావు చౌదరి కాకినాడ సెజ్ భూములను చౌకగా కొనుగోలు చేసి భారీగా లబ్ధి పొందారని యనమల లేఖలో ఆరోపించారు. అయితే, కెవి రావు పేరు వెనుక కులాన్ని సూచించే ‘చౌదరి’ లేడు. అయితే, యనమల ఉద్దేశపూర్వకంగా చౌదరిని ప్రస్తావించడం గమనార్హం. అంతేకాకుండా, కాకినాడ సెజ్‌లో తక్కువ ధరకు భూములు ఇచ్చిన రైతుల కోసం కుల జాబితాను కూడా యనమల చేర్చారు. సెజ్‌లోని భూములు కేవలం బీసీ వర్గాలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓసీ కులాలకు చెందినవని యనమల విస్మరించారు.
కాకినాడ సెజ్ రైతులకు న్యాయం జరగకపోతే పోరాటం చేయాల్సి వస్తుందని యనమల కూడా చెప్పడం గమనార్హం.
- ఈ అంశంపై తాను ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి లేఖలు రాసినట్లు ఆయన చెప్పారు. .
చంద్రబాబు నాయుడు తాను దూకుడుగా ఉండాలనుకుంటున్న అంశంపైనే దూకుడుగా ఉన్నారని, తన దూకుడును అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన యనమల వ్యూహం పనిచేస్తుందా? చంద్రబాబు, టీడీపీ నాయకత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటారా? వారు పట్టించుకోనట్లు వ్యవహరిస్తారా? పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన యనమలకు నోటీసులు జారీ చేయడానికి చంద్రబాబు ధైర్యం చేస్తారా? దీనిపై టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.