నిర్లక్ష్యం పై చంద్రబాబు ఆగ్రహం

తిరుపతి మృతులకు 25 లక్షల నష్ట పరిహారం

తిరుపతిలో తొక్కిసలాట ఘటన స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, అధికారులు స ఉన్నారు. బుధవారం చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు.

రద్దీ పెరుగుతుంటే ఏం చేసారు .   అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్‌, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్‌ల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

జేఈవోగా మీ బాధ్యత గుర్తులేదా: ఈ క్రమంలో టీటీడీ జేఈవో గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈవోగా మీ బాధ్యత గుర్తు లేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా అని మండిపడ్డారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని అలానే తొక్కిసలాట జరిగాక సహాయ చర్యలు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. వాట్సప్‌ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని జేఈవోను సీఎం చంద్రబాబు అడిగారు.

రూ.25 లక్షల పరిహారం : తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. రుయా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను మంత్రుల బృందం, జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

టెక్నాలజీ ఉపయోగించుకుని . . ఈవోపై సీఎం సీరియస్ . .

క్యూ లైన్ లో భక్తుల సంఖ్య పెరిగినపుడు ఎటువంటి చర్యలు చేపట్టాలనేది సిబ్బందికి చెప్పలేదా > వాట్సాప్ గ్రూప్ లో అప్ డేట్ ఇచ్చే ఏర్పాటు చేసుకోలేదు . టెక్నాలజీ పెరుగుతున్నా మీరు ఇంకా పాత పద్ధతులలోనే వెళ్లడం ఎందుకు ? అయినా ఇలాంటి వాటిలో నిర్లక్ష్యం పనికిరాదు . ఇది క్షమించరాని నేరం . . అని సీఎం చంద్రభాబు నాయుడు . . టీటీడీపీ ఈవో శ్యామలరావుకి వార్న్ 0గ్ ఇచ్చారు .