ఇంటికొక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ ఉండాలి . . సీఎం చంద్రబాబు ఆకాంక్ష . .

ఆంధ్రప్రదేశ్ లో కూటమి  ప్రభుత్వ0 ఈ ఏడు నెలలో సాధించిన  వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్​ ఇచ్చారు .

సమైక్యాంధ్రప్రదేశ్‌లో విజన్‌ 2020ని తెచ్చి అభివృద్ధిని సాధించి చూపామని చంద్రబాబు చెప్పారు. నాడు సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకెళ్లడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు .    సాధారణ రైతుల, కూలీల బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వెళ్లి అసాధారణ వ్యక్తులు, శక్తులుగా మారి సంపద సృష్టికర్తలయ్యారని గుర్తు చేశారు .

ఆ కారణంగానే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం  ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా   తయారైందన్నారు. ఇప్పుడు విజన్‌-2047తో ఏపీని మరింత అభివృద్ధి పథంలోకి నడిపించనున్నట్లు చెప్పారు. ‘ఇంటికి ఒక ఐటీ నిపుణుడు ఉండాలి అని చెప్పాను. దీంతో పాటు ఇంటికొకరు ఏఐ నేర్చుకోవాలి. ఆ సాంకేతికతను అభివృద్ధిచేసే స్థాయికి మనం చేరుకోవాలి. చాట్‌ జీపీటీలాంటి వాటిని తయారు చేసే మేధోశక్తి మనకూ అవసరం. 18న వాట్సప్‌ గవర్నెన్స్‌ను తీసుకురానున్నాం. 150కిపైగా సేవలను వాట్సప్‌లో అందుబాటులోకి తేనున్నాం. దీంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.’ అని అన్నారు.