- ఇంటర్మీడియట్ బోర్డు కొత్త రూపం
- పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
- ఇంటర్ బోర్డుకు ఛైర్మన్ గా మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలిని పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ బోర్డుకు ఛైర్మన్ గా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైస్ ఛైర్మన్ గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉండనున్నారు. అదేవిధంగా బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కళాశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఉపాధి శిక్షణ శాఖ, పాఠశాల విద్య, తెలుగు అకాడమీ డైరెక్టర్లు, సార్వత్రిక విద్యాపీఠం కార్యదర్శులు, సెకండరీ విద్య బోర్డు కార్యదర్శి మరియు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ను నియమించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆంధ్రా, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య, ఆచార్య ఎన్డీ రంగా వ్యవసాయ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్స్ తో పాటు రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కాలేజీలు, నారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లను ఇంటర్మీడియట్ బోర్డు నామినేటెడ్ సభ్యులుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.