Dreams Come True: ఐఐఎం అహ్మదాబాద్ లో అమితాబ్ మనవరాలు నవ్య నవేలి ప్రవేశం

బాలీవుడ్ (Bollywood) దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు నవ్య నవేలి నందా (Navya Naveli Nanda) తన కల సాకారం చేసుకున్నారు. ఆమె అహ్మదాబాద్ (Ahmedabad) లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో సీటు సాధించారు.

రెండేళ్ల కోర్సు అయిన ఎంబీఏ కోసం బ్లెండెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (Blended Post Graduate Programme) లో నవ్య నవేలి చేరారని తెలుస్తోంది. ఐఐఎంలో ప్రవేశం సాధించిన ఆమె తన సంతోషాన్ని ఇన్ స్టాగ్రామ్ (Instagram) వేదికగా పంచుకున్నారు. ‘‘కలలు నిజమవుతాయి!!! రాబోయే రెండేళ్లలో ఉండే ఇల్లు… అంటూ క్యాంపస్ ఫోటోలను షేర్ చేశారు. అయితే నవ్య నవేలి గతంలో పోడ్ క్యాస్ట్ వాట్ ది హెల్ నవ్య( Navya’s Podcast) ను హోస్ట్ చేసి పేరు సాధించిన విషయం తెలిసిందే.