ICC Charirman Election: బార్ క్లే నిర్ణయంతో ఐసీసీ ఛైర్మన్ గా జై షా..!

ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman) పీఠంపై బీసీసీఐ (BCCI) ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఐసీసీ కొత్త ఛైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా(Jay Shah) నియామకం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. తరువాత కూడా బార్ క్లే ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఆయన ఈసారి ఎన్నికల (Election) బరిలో నిలవకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐసీసీ కొత్త ఛైర్మన్ గా జై షా నిలుస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఐసీసీ ఛైర్మన్ ఎన్నికలో జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

అయితే ఐసీసీ నూతన ఛైర్మన్ ఎంపికకు నవంబర్ (November) లో ఎన్నిక జరగనుంది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంది. ఈ ఎన్నికలో మొత్తం 16 ఓట్లు ఉండగా.. తొమ్మిది ఓట్లను సాధించిన వ్యక్తి ఛైర్మన్ గా ఎన్నికవుతారు.