విదేశీ పెట్టుబడుల వెల్లువ . .

భారత్‌లో వ్యాపార , పారిశ్రామిక అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి . అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది . మనకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకున్నాయి . . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబరు) భారత్‌ 2,979 కోట్ల డాలర్ల (సుమారు రూ2.51 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐని ఆకర్షించింది. గత ఏడాది ఇదే కాలంతో వచ్చిన 2,050 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. ఈ ఆరు నెలల్లో ఎఫ్‌డీఐని ఆకర్షించడంలో మహారాష్ట్ర 1,355 కోట్ల డాలర్లు (రూ.1,14,490 కోట్లు), కర్ణాటక 354 కోట్ల డాలర్ల (రూ.29,800 కోట్లు)తో తొలి రెండు స్థానాల్లో ఉండగా తెలంగాణ 154 కోట్ల డాలర్ల (రూ.13,000 కోట్లు)తో ఏడో స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో వచ్చిన 2,979 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలో 1,360 కోట్ల డాలర్లు.. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు నెలల్లో వచ్చింది.

ఆరు నెలల్లో రూ.2.52 లక్షల కోట్లు పెట్టుబడులు ఇండియాకి వచ్చాయి .