” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ దేశ రాజకీయాలలో చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయ్ . ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ . , ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఆ ప్రోగ్రాం మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు . ”
హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ , హోంమంత్రి అమిత్ షా . ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె;పి నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు . పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు . , ఎన్డిఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు సైతం పాల్గొన్నారు . ఎంతమంది మహామహులు పాల్గొన్నా . . ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రధాన ఆకర్షణగా నిలిచారు . సైనీ ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు jp నడ్డా మధ్యలో చంద్రబాబుకు ప్రత్యేక కుర్చీ వేసి గౌరవించారు . ఆ తర్వాత జరిగిన NDA ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ సరసన చంద్రబాబును నిలుచోబెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది .
”చంద్రబాబుకు మోడీ , అమిత్ షా , నడ్డా తదితర ప్రముఖులు ఇస్తున్న గౌరవం చూస్తుంటే . . ఈయనను త్వరలో NDA కన్వీనర్ గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు . . ” అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు . గతంలో వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డిఏ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే . దేశవ్యాప్తంగా బీజేపీ పటిష్టతకు చర్యలు చేపడుతున్న తరుణంలో ఎన్డీయే కూటమికి కన్వీనర్ గా మరోసారి చంద్రబాబును ఎన్నుకుంటారని పలువురు ఎన్డీఏ భాగస్వాములు సైతం చెప్పుకొస్తున్నారు .