సాధారణంగా కిడ్నాపర్ల (Kidnappers)నుంచి బయటపడి తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలని భావిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ బాలుడు మాత్రం కిడ్నాపర్ చెర నుంచి విడుదలైనప్పటికీ తల్లిదండ్రులకు (Parents) వద్దకు వెళ్లకుండా మారాం చేస్తూ ఏడుస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) కు చెందిన సస్పెండెడ్ హెడ్ కానిస్టేబుల్ తనూజ్ చాహర్ రాజస్థాన్ కు చెందిన ఓ బిడ్డను నెలల వయసులోనే ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వేషం మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో నివసించే వాడని తెలుస్తోంది. దాదాపు 14 నెలల తరువాత తనూజ్ పోలీసుల (Polices) కు చిక్కాడు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించగా..వారి వద్దకు వెళ్లేందుకు మారాం చేస్తూ ఏడుస్తున్నాడు. కిడ్నాపర్ వద్దనే ఉంటానని చెబుతున్నాడు. ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది.