తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గత కొంతకాలంగా కేబినెట్ ( Cabinet) విస్తరణపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పార్టీ హైకమాండ్ (Party Highcommand) మంత్రివర్గ విస్తరణ మరియు నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చింది. పార్టీ అధినాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) సమావేశమై నూతన పీసీసీ అధ్యక్షుడుతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు.
అయితే రేవంత్ రెడ్డి కేబినెట్ ( Revanth Reddy Cabinet) లోకి మరో ఆరుగురికి అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈసారి ఆరు పదవులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. నలుగురిని ప్రస్తుతానికి ఎంపిక చేశారని సమాచారం. కాగా మంత్రి పదవుల రేసులో నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మరియు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఉన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ( Telangana PCC Chief) గా ఎస్టీని నియమిస్తే బాలూనాయక్ ను డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) గా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లేదా పీసీసీ చీఫ్ గా బీసీ, ఎస్సీ వర్గాల నుంచి ఎంపిక చేస్తే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్ మంత్రి పదవి రేసులో ఉండనున్నారు. అలాగే కేబినెట్ లో చోటు దక్కని నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇస్తారని సమాచారం.