Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే మొదటగా గుర్తుకొచ్చేది అదానీ గ్రూప్ షేర్ల పతనం. అటువంటి హిండెన్ బర్గ్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మేరకు సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.
షార్ట్ సెల్లింగ్ సంస్థ అయిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ భారతీయ కంపెనీకి సంబంధించి మరో కీలక విషయాన్ని వెల్లడించనుందని ఈ పోస్ట్ సూచిస్తుంది. అయితే అదానీ గ్రూప్ పై ఇన్ సైడర్ ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ రీసెర్చ్ గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 2023 లో వచ్చిన ఈ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ స్టాక్ ల మార్కెట్ విలువలో $86 బిలియన్ల క్షీణతకు దారితీసింది. తాజాగా హిండెన్ బర్గ్ పోస్ట్ తో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయని చెప్పుకోవచ్చు. హిండెన్ బర్గ్ విసిరే బ్రహ్మాస్త్రం ఏ సంస్థపై అనే విషయంపై చర్చ జోరుగా సాగుతోంది.