Controversy: వివాదంలో సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్.. !

సెబీ చీఫ్ (SEBI Chief) మాధబి పురీ బుచ్ మరోసారి వివాదం (Controversy) లో చిక్కుకున్నారు. తాజాగా ఆమెపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్ర ఆరోపణలు చేసింది.

మాధబి పురీ బుచ్ (Madhabi puri buch) సెబీ ఛైర్ పర్సన్ గా ఉంటూ ఐసీఐసీఐ (ICICI) నుంచి వేతనం తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజా సేవల్లో నైతికత మరియు జవాబుదారీతనాన్ని ఆమె ఉల్లంఘిస్తున్నారని విమర్శించింది. ఒక కంపెనీలో పని చేస్తూ అక్కడ మాత్రమే వేతనం తీసుకోవాలని పేర్కొంది. కానీ సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ విషయంలో అలా జరగడం లేదని తెలిపింది. సెబీ పూర్తికాల సభ్యురాలి (Full time member) గా ఉన్న ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కూడా వేతనం అందుకుంటున్నారని ఆరోపణలు (Allegations) చేసింది. ప్రస్తుతం మాధబి పురీ బుచ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.