జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ (Hema Commission Report) పై టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) మరోసారి స్పందించారు.ఈ మేరకు హేమ కమిటీ రిపోర్టును స్వాగతించిన ఆమె తెలంగాణ ప్రభుత్వాని (Telangana Government) కి విజ్ఞప్తి చేశారు.
సినీ ఇండస్ట్రీ (Cine Industry) లో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ప్రయత్నాలను ప్రశంసించారు. అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన తాము హేమ కమిటీ రిపోర్టు( Report) ను స్వాగతిస్తున్నామన్నారు. టాలీవుడ్ లోనూ 2019లో ది వాయిస్ ఆఫ్ విమెన్ (The Voice of Women) ఏర్పాటైందన్న సమంత మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ (Sub Committiee) నివేదికను పబ్లిష్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. కాగా ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ (Viral) గా మారింది.