కొన్ని రోజులుగా నిలిచిపోయిన పాస్ పోర్ట్ సేవా పోర్టల్ (Passport Seva Portal) షెడ్యూల్ కంటే ముందుగానే పునరుద్ధరించబడింది. సేవా పోర్టల్ (Seva Portal) మరియు జీపీఎస్పీ (GPSP) సెప్టెంబర్ ఒకటోవ తేదీ రాత్రి 7 గంటల నుంచి పని చేస్తున్నాయని అధికారిక పాస్ పోర్ట్ సేవా వెబ్ సైట్ తెలిపింది.
ఈ క్రమంలోనే ఆగస్ట్ 30,2024న షెడ్యూల్ చేయబడిన అపాయింట్ మెంట్లన్నీ రీషెడ్యూల్ (Re-Schedule) చేస్తామని పేర్కొంది. అయితే ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆగస్ట్ 29న కేంద్ర విదేశాంగ శాఖ (Union Ministry of External Affairs) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 29న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు నిలిచిపోతాయని చెప్పింది. కానీ అనుకున్న దానికంటే ముందుగానే సెప్టెంబర్ 1వ తేదీనే సేవలను పునరుద్ధరించింది. కాగా కొత్త పాస్ పోర్ట్ (New Passport) కోసం దరఖాస్తు చేయడానికి లేదా పాస్ పోర్టును పునరుద్ధరించడానికి యావత్ దేశ వ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్ మెంట్ లను బుక్ చేయడానికి పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ఉపయోగించబడుతుంది.