చారిత్రక సెనేట్ హాల్ (Historic Senate Hall) గా పేరుగాంచిన అలహాబాద్ విశ్వవిద్యాలయం ( Allahabad University) లోని క్లాక్ టవర్ ను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు అలహాబాద్ విశ్వవిద్యాలయం (AU) ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (CPWD) తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది.
ఇందులో ఐఎన్టీఏసీహెచ్ నిపుణులు పునరుద్ధరణ పనుల (Restoration works) ను పర్యవేక్షించనుండగా.. సీపీడబ్ల్యూడీ సెనేట్ హాల్ లో పనిని నిర్వహించనుంది. దాంతోపాటుగా క్లాక్ టవర్ (Clock Tower) మరమ్మత్తు పనులను కూడా చేపట్టనున్నారు. కాగా ఏయూలోని ప్రత్యేకమైన సెనేట్ హాల్ మరియు క్లాక్ టవర్ నిర్మాణ, కళాత్మక విలువలను పరిరక్షించడం కోసం ఈ చొరవ తీసుకున్నట్లు ఐఎన్టీఏసీహెచ్ ప్రయాగ్ రాజ్ చాఫ్టర్ ( INTACH Prayagraj Chapter) సభ్యుడు వైభవ్ మైని చెప్పారని తెలుస్తోంది. ఈ మేరకు ఆగస్ట్ 18వ తేదీన సెనేట్ హాల్ మరియు క్లాక్ టవర్ పరిరక్షణ కోసం అవగాహన ఒప్పందం కుదరగా.. టెండర్ ప్రక్రియ (Tender Process) తరువాత పనులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.