Mining Royalty Case: సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ

మైనింగ్ రాయల్టీ కేసు ( Mining Royalty Case) లో సుప్రీంకోర్టు ( Supreme Court) ఇచ్చిన తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ తగిలింది. గనులు, ఖనిజాలపై విధించిన రాయల్టీ (Royalty on Minerals) ని ఏప్రిల్ 1, 2005 నుంచి రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పునిచ్చింది.

రాయల్టీ ఈ ఏడాది జులై 25 నుంచే అమలు చేయాలని కోరిన కేంద్రం అభ్యర్థనను సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ( Justice DY Chandra Chud) నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఈ క్రమంలోనే రానున్న 12 సంవత్సరాల్లోగా ఈ బకాయిలను దశల వారీగా చెల్లించాలని కేంద్రానికి కీలక ఆదేశాలు (Orders to Central) జారీ చేసింది. అదేవిధంగా వీటిపై ఎటువంటి పెనాల్టీని విధించవద్దని రాష్ట్రాలకు సూచించింది. అయితే ఖనిజాలు ఉన్న భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని 1989లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పిటిషన్ లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల వాదనలు విని తీర్పును రిజర్వ్ ( Judgement Reserve) చేసింది. తాజాగా గత నెల 25వ తేదీ నుంచి వర్తింపజేయాలన్న కేంద్రం అభ్యర్థన ( Central Request) ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని స్పష్టం చేసింది. కేంద్రానికి ఆ హక్కు లేదని తెలిపింది. కాగా ఈ తీర్పుతో జార్ఖండ్, బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది.