ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం (Delhi Liquor Policy Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ( Supreme Court) నిరాకరించింది.
లిక్కర్ పాలసీలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ల ( Petitions) పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఇందులో భాగంగా కవిత తరపున ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. కవిత అభ్యర్థనపై సీబీఐ, ఈడీ ( CBI, ED) స్పందన తెలిపాలని సుప్రీం ధర్మాసనం కోరింది. ఈ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. అనంతరం తదుపరి విచారణ ( Next Hearing)ను ఆగస్ట్ 20వ తేదీకి వాయిదా వేసింది.